కుక్కలపై.. ఛీ పాడు.. చండాలం..
posted on Mar 17, 2021 @ 4:43PM
మనిషి మెదడు భయంకరమైన ఆలోచలనాలకు అడ్డాగా మారుతుంది. తన కా,మ వాంఛలు తీర్చుకోవడానికి ఎంతకైనా తెగపడుతున్నాడు. తన వాంఛ తీర్చుకోవడానికి ఒక వ్యక్తి రూటు మార్చడు.. మహిళలపై దాడి చేస్తే కేసులు, శిక్షలు అనుకున్నాడేమో.. వీధి కుక్కలతో తన వాంఛ తీర్చుకున్నాడు ఓ కామాంధుడు . వీధి కుక్కలకు ఆహారంతో గాలం వేసి.. వాటికి బంధించి. వాటిపై లై*గిక దాడి చేశాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది.
మనిషి ఆలోచనలు దిగజారుతున్నాయనే దానికి ఇలాంటి ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా 30 వీధి కుక్కలను లై*గికంగా హింసించాడు. ఆహారం ఆశచూపి వాటిని దగ్గరికి తీసి.. ఆ తర్వాత లై*గికంగా దాడి చేసి వేధించాడు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని కూరగాయలు అమ్ముకునే 60 ఏళ్ల అహ్మద్ షాహిగా గుర్తించారు. అతడు దాదాపు 30 కుక్కలపై లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టు తేల్చారు. అంధేరి పశ్చిమ ప్రాంతంలో అహ్మద్ వీధి కుక్కకు ఆహారం ఆశ చూపి అత్యాచారానికి పాల్పడుతున్న దృశ్యాలను బాంబే యానిమల్ రైట్స్ అనే స్వచ్చంద సంస్థకు చెందిన ఓ వాలంటీర్ సీక్రెట్‌గా రికార్డు చేశాడు. ఈ వీడియోలను పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు ఆ వీడియో ఆధారంగా విచారణ ప్రారంభించారు. నిందితుడు అహ్మద్‌పై సెక్షన్స్ 377, 422 కింద కేసు నమోదు చేశారు. అలాగే జంగతు సంరక్షణ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక, అతన్ని స్థానిక కోర్టులో హాజరుపరుచగా.. న్యాయస్థానం రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు ట్విట్టర్‌లో ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీధి కుక్కలకు రక్షణ కల్పించాలని అధికారులకు పిర్యాదు చేశారు.